Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
బెంగళూరు: ఇప్పుడున్న కల్తీ రాజకీయాలకు కలత చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన పదవికి గుడ్‌బై చెప్పేశారు. దక్షిణ కన్నడ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా వున్న శశికాంత్ సెంథిల్ తన పదవికి రాజీనామా చేసినట్టు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. ‘దేశ ప్రజాస్వామ్య పునాదులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితులలో నేను ఓ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించడం అనైతికంగా భావిస్తున్నా’ అంటూ శశికాంత్ ఆ లేఖలోవివరించారు. రాబోయే రోజుల్లో దేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోబోతోందని ఆయన అంటున్నారు. విధుల నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నందుకు ప్రజలు క్షమించాలని కోరారు. కొన్ని రోజుల క్రితం ఇలానే దాద్రనగర్ హవేలీలో ఓ ఐఏఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. ఐఎఎస్ అధికారుల రాజీనామాలు ఇటీవలి కాలంలో దేశంలో ఒక సంచలనం.