ప్రముఖ నిర్మాత, యాక్టర్ బండ్ల గణేష్ ని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీస్ లు. గతంలో పీవీపీ పై బండ్ల తన అనుచరులతో దాడి చేసాడనే కేసు లో అరెస్ట్ చేశారు. టెంపర్ సినిమా టైమ్ లో తీసుకున్న 30 కోట్ల ఫైనాన్స్ లో 7 కోట్లరూపాయలు బండ్ల గణేష్ ఇవ్వలేదంటూ పీవీపీ ఆరోపిస్తున్నారు. తన అప్పు తీర్చాలంటూ అడిగితే బండ్ల గణేష్ అనుచరులతో దాడి చేసాడని పీవీపీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. పీవీపీ పిర్యాదు మేరకు 420, 448, 506 r/w 43 ipc సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. గతం లో ఉన్న కేసులను సైతం విచారించనున్నట్లు సమాచారం.