తెలంగాణలో సంచలనం సృష్టించిన బ్యాంక్ ఉద్యోగిని హత్యకేసులో నిందితుడు వెంకటేష్ వేములవాడ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నిందితుడి కోసం ఐదు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టడంతో.. వెంకటేష్ నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో దివ్య అనే యువతిని వెంకటేష్ దారుణంగా హతమార్చి పారిపోయాడు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.
ఒకరికి ఒకరు ప్రేమించుకోవడంతో వీరికి మూడేళ్ళ కిందట ప్రేమ వివాహం జరిగింది. ఈ పెళ్ళికి వెంకటేష్ తల్లిదండ్రులు నిరాకరించడంతో.. పెళ్లి తరువాత దివ్యకు, వెంకటేష్ కు మధ్య విబేధాలు వచ్చాయి. దాంతో ఇద్దరి విడిపోయారు. అతని నుంచి విడిపోయికనా, వేధింపులు ఎక్కువవటంతో.. దివ్య తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. తమ కుమార్తెను మరోసారి వేధించకుండా వెంకటేష్ తో ప్రమాణ పత్రం రాయించుకున్నారు. కొంతకాలం కిందటే దివ్యకు బ్యాంక్ లో ఉద్యోగం రావడంతో.. ఆమెకు వరంగల్ కు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.
ఈ విషయం వెంకటేష్ కు కూడా తెల్సింది. అయితే తనకు దక్కని అమ్మాయి మరెవరికి దక్కకూడదనే స్వార్థంతో దివ్యను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. నెత్తుటి మడుగులో కొట్టుమిట్టాడుతూ దివ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అక్కడి నుంచి నిందితుడు వెంకటేష్ పరారయ్యాడు. అనుమానంతో అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు వేములవాడలో వెంకటేష్ నివాసానికి తాళం వేసి ఉంటడం కనిపించింది. దాంతో అతనే దివ్యను హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానించారు. ఇప్పుడు నిందితుడు వెంకటేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.