జమ్మూకశ్మీర్ లో మైనార్టీ హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాది కాల్చి చంపాడు. కుల్గాం జిల్లా ఆరేహ్ మోహన్ పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇలాక్ దేహతీ బ్యాంకులోకి ఓ ఉగ్రవాది గురువారం ఉదయం చొరబడ్డాడు. మేనేజర్ క్యాబిన్ కు వెళ్లి అక్కడ ఉన్న మేనేజర్ విజయ్ కుమార్ పై కాల్పులు జరిపాడు.
రెండు రౌడ్ల కాల్పులు జరపగా మేనేజర్ విజయ్ కుమార్ అక్కడడే కుప్పకూలిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ ఈ లోపే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు.
తుపాకీని తన బ్యాగులో పెట్టుకుని బ్యాంకులోకి వచ్చి కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతన్నాయి.