ప్రతి నెల బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడిస్తుంది. ఇందులో భాగంగా మే నెలలో 11 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవని పేర్కొంది. అసలు మే నెల సెలవుతోనే మొదలవుతుంది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసింది.
మే నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు పని చేయవు. మొత్తంగా 11 రోజుల పాటు మే నెలలో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. అంతేకాక మే తొలి వారంలోనే మూడు రోజుల పాటు బ్యాంకులు మూత పడుతున్నాయి. ఇక రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన బ్యాంకు సెలవులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ప్రైవేట్ రంగ బ్యాంకులకు, ఫారిన్ బ్యాంకులకు, కోఆపరేటివ్ బ్యాంకులకు, రీజనల్ బ్యాంకులకు వర్తిస్తాయి.
అలాగే, మూడు కేటగిరీల కింద ఆర్‌బీఐ బ్యాంకులకు సెలవులను ఇస్తోంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకు క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కేటగిరీల కింద బ్యాంకులకు సెలవును కేటాయిస్తుంది.
ప్రాంతాల వారీగా బ్యాంకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.
మే 1, 2022 ఆదివారం(దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
మే 2, 2022 సోమవారం..రంజాన్-ఈద్ (కేరళలోని తిరువనంతపురంలో, కొచ్చిలో బ్యాంకులు మూత)
మే 3, 2022 మంగళవారం.. భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి/రంజాన్-ఈద్, బసవ జయంతి/అక్షయ తృతీయ (కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో మినహా దేశవ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు)
మే 8, 2022.. ఆదివారం అన్ని చోట్ల బ్యాంకులకు సెలవు
మే 9,2022.. సోమవారం.. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి(పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు)
మే 14, 2022.. రెండో శనివారం అన్ని చోట్ల బ్యాంకులకు సెలవు
మే 15, 2022.. ఆదివారం అన్ని చోట్ల బ్యాంకులకు సెలవు
మే 16, 2022.. సోమవారం.. బుద్ధ పూర్ణిమ(త్రిపుర, బెల్లాపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖాండ్, జమ్మూ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, చత్తీస్‌ఘడ్, ఝార్ఖాండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూత)
మే 22, 2022.. ఆదివారం అన్ని చోట్ల బ్యాంకులకు సెలవు
మే 28, 2022.. రెండో శనివారం అన్ని చోట్ల బ్యాంకులకు సెలవు
మే 29, 2022.. ఆదివారం అన్ని చోట్ల బ్యాంకులకు సెలవు