దొంగల ముఠా తో చేతులు కలిపి వక్రమార్గం పట్టాడు బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలీ. ఆ ముఠా తో కలిసి అకాడమీ నిధులను కాజేశాడు. అయితే మేనేజర్ వలీకి అందులో పెద్దగా గిట్టుబాటు కాకపోవడంతో సొంతంగానే ప్రయత్నా లు స్టార్ట్ చేశాడు.
గిడ్డంగుల సంస్థ నిధులను కొల్లగొట్టే విషయంలో ముఠా కు తెలియకుండా గోప్యాంగా వ్యవహరించాడు. కాగా వలీ
వల్ల నష్టపోయిన ₹55 కోట్లు రికవరీ అయ్యే అవకాశం లేకపోవడంతో యూబీఐ బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు.
మరోవైపు కెనరా బ్యాంకు పది కోట్లు అకాడమీ కి చెల్లించి రోజులు గడుస్తుండటంతో యూబీఐ అధికారులపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది.