కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్ర తరం అవుతుండటంతో… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఉత్పత్తి రంగం సహా అన్నీ రంగాలు ఇంటికే పరిమితం అయ్యాయి. ఎప్రిల్ 14వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నా… ఎప్పటి వరకు పొడగిస్తారో అన్న సందేహాం అలాగే ఉంది.
దీంతో, ఈఎంఐలపై ఆధారపడ్డ నెలసరి ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో, ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటించింది. ఈఎంఐలు ఎలాంటివి అయినా మూడు నెలల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. మూడు నెలల పాటు అన్ని రకాల ఈఎంఐలపై మారిటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.
ఇక భారత వృద్ధి రేటును కరోనా వైరస్ ప్రభావితం చేస్తుందని అంగీకరించిన ఆర్బీఐ, ఈ సంవత్సరం వృద్దిరేటు 5శాతంకు మించదని అంచనా వేస్తుంది. ఇక రివర్స్ రేపోరేటు, రేపో రేటుపై 75బేసిక్ పాయింట్స్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఈఎంఐలలో, లోన్ ఉన్న వారికి కాస్త ఉపశమనం వచ్చే అవకాశం ఉంది.