కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి బ్యాంకులు అత్యవసర సేవలు మాత్రమే అందించనున్నాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ ప్రకటించింది. అసోషియేషన్ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచ్ లలో క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాల్స్, చెక్ డిపాజిట్స్, రెమిటెన్సెస్, ప్రభుత్వ లావాదేవీలు మాత్రమే జరుగుతాయి. పరిస్థితులను బట్టి ఇతర సేవలను కూడా సస్పెండ్ చేయవచ్చని ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా తెలిపారు. అత్యవసరమైతేనే తప్ప కస్టమర్లు బ్యాంక్ లకు రావాలని అసోషియేషన్ తెలియజేసింది. అత్యవసరం కాని వాటికి మొబైల్, ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరింది. డిజిటల్ చానల్స్ లో 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావంతో వ్యాపారాలు నిలిచిపోయిన వారికి రుణాలు ఇచ్చేందుకు ఎస్.బి.ఐ పథకాన్న రూపొందిస్తున్నట్టు తెలిసింది.