కరోనా వైరస్ దెబ్బకు బాలీవుడ్ విలవిలలాడుతోంది. వరుసపెట్టి ఇండస్ట్రీ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. దీంతో కోట్లాది రూపాయల బడ్జెట్‌తో మొదలుపెట్టిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఇప్పటికే పదిమందికిపైగా బీటౌన్ సెలబ్రెటీలు కరోనా బారినపడగా.. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి చేరారు. ఆయనకు కరోనా సోకినట్టు ఆయన మేనేజర్ వెల్లడించారు. బప్పిలహరి ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు.
కాగా ఇప్పటికే బాలీవుడ్ సెలబ్స్ మనోజ్, ఆశిష్ విద్యార్థి , రణ్‌బీర్ కపూర్, సంజయ్‌లీలా భన్సాలీ, సిద్ధార్థ్ చతుర్వేది, హీరోయిన్ తారా సుతారియా, దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్, యంగ్ హీరోలు విక్రాంత్ మెస్సీ, కార్తీక్ ఆర్యన్.. అలాగే డైరెక్టర్లు కనుబెల్, అమిత్ శర్మతో పాటు నటులు పరేష్ రావల్, మాధవన్, ఆమిర్ ఖాన్, మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు ఇలా వరుసపెట్టి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఇందులో కొందరు కోలుకోగా.. మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు.