ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆయన.. ముంబైలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.
బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో పాటలను కంపోజ్ చేసి పాడారు బప్పి. బాలీవుడ్ లో 2020లో వచ్చిన బాఘీ-3కి ఆయన చివరిసారిగా పనిచేశారు. భారత చిత్రసీమకు డిస్కోను పరిచయం చేసిన ఘనత ఈయనదే.
1952 నవంబరు 27న జన్మించిన బప్పి లహరి… హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాళీ, గుజరాతీ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. బాలీవుడ్ లో 50కి పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. తెలుగులో 2020లో వచ్చిన డిస్కోరాజా చిత్రంలో పాట పాడారు. ఇదే ఆయన చివరి పాట.
బప్పి మృతిపై ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. బప్పి లహిరి సంగీతం వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో బప్పి ఫోటోను పోస్ట్ చేశారు మోడీ.