తెలంగాణ హైకోర్టు లాయర్ల హత్యపై బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా మండిపడింది. ఇది న్యాయవాదుల వృత్తిపై జరిగిన దాడిగా అభివర్ణించిన బార్ అసోసియేషన్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేన్ కు పూర్తి మద్ధతు ప్రకటించింది.
లాకప్ డెత్, అధికార పార్టీ నేతపై పోరాడుతున్నందుకే ఇలా చేశారని… దీనిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని తెలిపారు. తెలంగాణ పోలీసుల విచారణపై నమ్మకం లేదని, హత్యకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరాతమని తెలిపారు.
ఈ అంశంలో ప్రభుత్వం, హైకోర్టు నుండి వీలైనంత త్వరగా చర్యలుంటాయని ఆశిస్తున్నామని… లాయర్లపై దాడులు జరగకుండా కేంద్రం స్పందించాలని కోరారు.