ఆన్ లైన్ బెట్టింగ్ ఓ బార్బర్ జీవితాన్ని మార్చేసింది. కోటి రూపాయలకు అధిపతిని చేసింది. అతడి కష్టాలన్నీ తీర్చేసింది. ఇంతకీ ఎక్కడనేగా మీ డౌట్.
బీహార్ లోని మధుబనీ జిల్లాకు చెందిన అశోక్ కుమార్ కు ఓ సెలూన్ షాపు ఉంది. తన కుటుంబానికి ఇదే ఆధారం. అయితే అశోక్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆన్ లైన్ బెట్టింగ్ వేస్తుంటాడు. డ్రీమ్ 11 యాప్ లో బెట్టింగ్ పెడుతుంటాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో సీఎక్కే, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ పై డబ్బులు పెట్టాడు. అంతే.. ధనలక్ష్మి అశోక్ తలుపు తట్టింది.
ఆన్ లైన్ బెట్టింగ్ లో అశోక్ కుమార్ కోటి రూపాయలు గెలిచాడు. తనకు ఎన్నో అప్పులు ఉన్నాయని.. వచ్చిన డబ్బుతో వాటన్నింటినీ తీర్చి మంచి ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు. అయితే డబ్బులు వచ్చాయి కదా అని తన వృత్తిని మాత్రం వదులుకోనని అంటున్నాడు అశోక్.