టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ చిత్రం మిన్నల్ మురళీ. ఈ సినిమా ఇండియన్ సూపర్ హీరో అనే థాట్ ని అందరికి రీచ్ అయ్యేలా చేసింది. లైట్నింగ్ పవర్ తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథ ఈ సినిమా.
అదే పవర్ ఉన్న విలన్ కూడా కథలోకి వచ్చేస్తే… హీరోకి, విలన్ కి ఒకే పవర్ ఉంటే, అనే పాయింట్ చిత్రమే మిన్నల్ మురళీ. ఆ పాయింటే సినిమాని చాలా ఇంటరెస్ట్ గా మార్చింది. బేసిల్ జోసెఫ్ ఈ సినిమాని అందరికి నచ్చేలా తెరకెక్కించాడు.
అతి తక్కువ బడ్జెట్ తో సినిమా తీయొచ్చని అని నిరూపించాడు.ఆ చిత్రానికి గాను ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నాడు. ఏషియన్ అకాడెమీ అవార్డ్స్ 2022 లో బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో బేసిల్ జోసెఫ్ ఈ అవార్డు ని అందుకలున్నాడు.
16 ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చిన సినిమాలు ఏషియన్ అకాడెమీ అవార్డ్స్ లో పాల్గొన్నాయి. బేసిల్ జోసెఫ్ కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం తో కేరళ ఫిల్మ్ ఫెటర్నిటీ అభినందనలు తెలుపుతున్నారు.