సైబరాబాద్ కమిషనరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సీపీ స్టీఫెన్ రవీంద్ర కుటుంబసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాల్గొని బతుకమ్మ ఆడారు. అందరూ బతుకమ్మలను అందంగా అలంకరించి పాటలు పాడారు.
బతుకమ్మ సంబురాల్లో పోలీస్ కుటుంబ సభ్యులందరినీ కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు సీపీ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అని చెప్పారు. ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాం.. కానీ పువ్వులనే కొలిచే సాంప్రదాయం మన తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. బతుకమ్మ పాటలు వినసొంపుగా ఉంటాయని చెప్పారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.ః