– భట్టి విక్రమార్క
దేశానికి సంబంధించినంత వరకు ఈ రోజు పరమ పవిత్రమైన రోజు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మంచిర్యాలకు రావడం మనందరి అదృష్టం. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంటే దాన్ని కాపాడేందుకు ఖర్గే నాయకత్వంలో జై భారత్ సత్యాగ్రహ సభను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్టు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సమానత్వం కోసం, ఈ దేశ సంపద ప్రజలకే చెందాలని ఆరాటపడుతున్నారు. దేశ సంపద అదానీ అంబానీల చేతుల్లోకి వెళ్ల కూడదని ఆయన పోరాటం చేస్తున్నారు.
మతోన్మాద శక్తుల చేతుల్లో నుంచి దేశాన్నిరక్షించేందుకు రాహుల్ గాంధీ నడుస్తున్నారు. అందుకే కేంద్రం భయపడి రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టి అనర్హత వేటు వేశారు. రాహుల్ గాంధీపై కుట్రలు చేశారు. అదిలాబాద్ జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయి. పచ్చటి అడవులు ఉన్నాయి, మనసు నిండా ప్రేమించే గిరిజనులు వున్నారు. రాష్ట్రం వచ్చాక ఆ అడవి బిడ్డలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో పోడు భూముల సమస్య ఒకటి.
ఆనాడు కాంగ్రెస్ ఫారెస్టు రైట్స్ యాక్ట్ తెచ్చి భూములు ఇచ్చింది. కానీ తెలంగాణ వచ్చాక భూములు ఇవ్వక పోగా, ఇచ్చిన భూములును కూడా లాక్కుంటున్నారని ప్రతి గ్రామాల్లో చెబుతుంటే బాధ కలుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోడు భూములు పట్టా ఇచ్చేలా ఆలోచన చేస్తాం.