ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని బ్రిటన్ అధికార పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్ మెన్ తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన డాక్యుమెంటరీగా దీన్ని ఆయన అభివర్ణించారు. బీబీసీ అనేది బ్రిటన్ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించదని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోడీపై ఇలా బీబీసీ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆయన తెలిపారు. ఆ డాక్యుమెంటరీని ఓ కుట్రగా పేర్కొన్నారు. బీబీసీపై ఐటీ దాడులను ఆయన సమర్థించారు. ఐటీ దాడులు సాధారణమైన విషయమని ఆయన వెల్లడించారు.
భారత్ లోని చట్టాలను బీబీసీ పాటించాల్సిందేనని ఆయన అన్నారు. విచారణకు బీబీసీ సహకరించాలని ఆయన సూచించారు. భారత్ బ్రిటన్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను బలహీన పరిచేందుకు బీబీసీ కుట్రగా ఇది కనిపిస్తోందన్నారు.
ప్రధాన మంత్రి మోడీపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని ప్రయత్నాలను ఆయన కొనియాడారు. ప్రధాని మోడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఉద్దేశంతో చేసిన చర్య ఇది ఆయన అన్నారు.