తెలంగాణ డీజీపీపై జాతీయ బీసీ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు బనాయించినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఈ నెల 25న జరిగే విచారణకు డీజీపీ స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇతర అధికారులను పంపితే అంగీకరించేది లేదని కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు చెప్పారు.
వినాయక చవితి ఏర్పాట్ల కారణంగా సోమవారం జరిగిన విచారణకు డీజీపీ వెళ్లలేదు. ఆయన తరఫున డీసీపీని పంపారు. దీనిపై బీసీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని గత నెల 10న తీన్మార్ మల్లన్న జాతీయ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది బీసీ కమిషన్.