హుజురాబాద్ ఉప ఎన్నిక అనగానే పార్టీల మధ్య ఫైటింగ్ లా కాకుండా కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారిపోయింది. ఈటలను ఎలాగైనా ఓడించాలన్న కసితో కేసీఆర్, గెలిచి తీరి తన సత్తా ఎంటో చూపించాలన్న పట్టుదలతో ఈటల హోరాహోరీ పోరాడుతున్నారు.
సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు ఎన్నికల కోసమేనని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పటికే ఇంటికో 10లక్షల పంపిణీ కొనసాగుతుండగా… ఇంకా కొన్ని కుటుంబాలకు అందాల్సి ఉంది. అయితే, కేవలం దళితుల్లోనే కాదు బీసీల్లో ఇబ్బందిపడుతున్న ప్రజలు, కుటుంబాలున్నాయి. వారంతా ఇప్పటికే వారికేనా ఇంటికో 10లక్షలు… మాకెందుకు ఇవ్వరు అని బీసీలు ఫైర్ అవుతున్నారు. చాలా మందిలో ఆ ఫీలింగ్ ఉంది.
ఇది ఇప్పటికే గ్రహించిన టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపింది. ఆయన వరుసగా కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. రెడ్ల కోసం కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తున్నామని చెప్పినా ఆ వర్గం అంతా ఈటల వైపే ఉండే అవకాశం ఉంది. బీసీ సంఘాలు కనీసం తమకు ఇంటికో లక్ష ఇచ్చే స్కీం పెట్టినా బాగుండు కదా అన్న ఫీలింగులో ఉన్నారు. ఇప్పుడు ఈ కోపం, ఆ కోపం కలిసి బీసీలు టీఆర్ఎస్ కు షాకిస్తే…? అన్న సందేహం, భయం, అనుమానం టీఆర్ఎస్ వర్గాలను వెంటాడుతోంది.