కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 28న ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హమ్ వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్ ను ప్రవేశ పెట్టబోతున్న విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో క్రికెట్ పోటీలు జరుగుతాయి.
ఈ మేరకు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథిగా వ్యవహరించబోతున్న ఈ జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా ఉండనుంది. ఇటీవలే శ్రీలంకను వారి స్వదేశంలో వరుసగా టీ20, వన్డేలలో ఓడించి సిరీస్ లు నెగ్గిన టీమిండియా.. ఆ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో కామన్వెల్త్ క్రీడల్లో బరిలోకి దిగుతున్నది. ఇక టీమిండియా మాజీ సారథి మిథాలీ రాజ్ ఆట నుంచి నిష్క్రమించిన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ కు అసలైన పరీక్ష కామన్వెల్త్ లో ఎదురుకానుంది.
కామన్వెల్త్ క్రీడలకు భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తనియా సప్న భాటియా, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రకార్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా.
స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్
Advertisements
రెండు గ్రూపులుగా విడదీసిన ఈ క్రీడలలో గ్రూప్-ఏ లో భారత్ ఉంది. భారత్ తో పాటు బార్బోడస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లు ఉన్నాయి. రెండు గ్రూప్ లలో టాప్-2 గా ఉన్న జట్లు సెమీస్ చేరతాయి