టీమ్ ఇండియా మరో హిస్టరీ క్రియేట్ చేసింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం జరిగిన పోటీలో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు.. మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. తాజా గెలుపుతో టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టీమిండియా నంబర్ వన్‌గా నిలిచింది. ఇక ఇప్పటిదాకా మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆసీస్ మూడోస్థానానికి పడిపోయింది. కాగా న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. అద్భుతమైన శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించారని కొనియాడారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అటు బీసీసీఐ కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా వెళ్లి.. టెస్ట్ సిరీస్ గెలవడం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ అన్నారు. బీసీసీఐ తరపున టీమిండియాకు రూ .5 కోట్ల బోనస్‌ను ప్రకటించారు. వారి విజయం వెలకట్టలేనిదని ఆయన అన్నారు.