జట్టులోకి మళ్ళీ తిరిగి వచ్చిన బుమ్రా, హర్షల్ పటేల్
టీ 20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఈ ‘సంరంభం’ ప్రారంభం కానుంది. ఇక 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. రోహిత్ శర్మ (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
ఆస్ట్రేలియాతో ఆడబోయే జట్టు
రోహిత్ శర్మ, (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తిక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి మళ్ళీ వచ్చారు. గాయాల కారణంగా గత ఆగస్టులో ఆసియా కప్ టోర్నీకి
వీళ్ళు దూరంగా ఉన్నారు. ఇక మహ్మద్ షమీ, శ్రేయాస్ లియర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఉంటారు.
దక్షిణాఫ్రికాతో ఆడబోయే జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్) , విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా
ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది. అక్టోబరు 23 న ఈ మ్యాచ్ జరగనుంది. యువ క్రికెటర్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా తమ స్థానాలను పదిలం చేఉకున్నారు. ఆ మధ్య టీ 20 టోర్నీలో అంతగా రాణించని రవిచంద్రన్ అశ్విన్ మీద ఈ సారి బీసీసీఐ నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి జట్టులో పెద్దగా మార్పులేవీ లేవు.