ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్ కు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా టెస్టు జట్టు నేటి నుంచి ఇంగ్లాండ్ లో ప్రారంభమయ్యే ఎడ్జ్ బోస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతోంది.
టీ 20 సిరీస్ జూలై 7 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు జూలై 12 నుంచి వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. టెస్టు, వన్డేలకు వేరు వేరు జట్లను బీసీసీఐ ప్రకటించింది.
టీ20, వన్డే జట్లకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఆయనకు టెస్టుల్లో బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. రెండో టీ 20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, జశ్ ప్రీత్ బుమ్రాలు జట్టులో చేరనున్నారు.
మరోవైపు ఆటగాళ్లు శిఖర్ ధావన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లను వన్డే మ్యాచ్ లకు మాత్రమే ఎంపిక చేశారు. ఈ సారి కొత్త ఆటగాడు అర్హదీప్ సింగ్ ను వన్డే జట్టుకు సెలెక్ట్ చేసింది. ఐర్లాండ్ మ్యాచ్ అవకాశం లభించని రాహుల్ త్రిపాఠికి ఈసారి టీ 20లో అవకాశం బీసీసీఐ కల్పించింది.
మొదటి టీ 20కి భారత జట్టుః
రోహిత్ శర్మ( కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుకమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తిక్( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్,అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్,
రెండవ, మూడవ టీ 20లకు టీమ్ ఇండియా జట్టుః
రోహిత్ శర్మ( కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, , సూర్యకుకమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రుషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్,
వన్డే జట్టుః
రోహిత్ శర్మ( కెప్టెన్), శిఖర్ దావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుకమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్