బీసీసీఐలో కీలక వ్యక్తి రాజీనామా చేశారు. బోర్డులో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అభిజిత్ సాల్వీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 30తో నోటీస్ పీరియడ్ పూర్తైనప్పటికీ.. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు ముగిసే వరకు తన సేవలను కొనసాగించానని సాల్వీ గుర్తు చేశారు.
బీసీసీఐలో 10 ఏళ్లు తన సేవలు అందించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు సాల్వి తెలిపారు. కరోనా సమయంలో పని చేయడం సవాల్ గా మారిందని అన్నారు. వచ్చే నెలలో జరగనున్న అండర్-16, విజయ్ మర్చంట్ ట్రోఫీకి ముందు ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్ల వయస్సు నిర్ధారణ, యాంటీ డోపింగ్, మెడికల్ విభాగానికి సాల్వి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.