ఐపీఎల్ 2020 స్పాన్సర్‌షిప్ నుంచి వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా తప్పుకుంది. ఈ మేర బీసీసీఐ, వివో మధ్య జరిగిన ఒప్పందం 2020 సంవత్సరానికి గానూ రద్దు చేసుకున్నట్లు ఐపీఎల్ స్పష్టం చేసింది. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఇప్పటికే టిక్‌టాక్‌తో సహా పలు చైనీస్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ స్పాన్సర్‌గా కొనసాగడం భావ్యం కాదని భావించిన వివో స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు తెలిసింది. అయితే.. ప్రస్తుతానికి ఈ సంవత్సరం వరకూ తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ లీగ్‌లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.