ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేన 5టెస్టు మ్యాచుల సిరీస్ ను 2-1తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో ఇండియా గెలిచినా, డ్రా అయినా సిరీస్ సొంతం చేసుకుంటుంది. ప్రతిష్టాత్మక ఓవల్ మైదానంలోనూ భారత్ సూపర్ విక్టరీ కొట్టింది.
అయితే, 4వ టెస్టు కొనసాగుతున్న సమయంలోనే కోచ్ రవిశాస్త్రితో పాటు టీం సహయక సిబ్బంది కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా లంచ్ కు బయటకు వెళ్లినట్లు బీసీసీఐకి సమాచారం అందింది. ఈ విషయాన్ని కోచ్, కెప్టెన్ కోహ్లి బీసీసీఐ వద్ద దాచిపెట్టడంతో బోర్డు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బయటకు వెళ్లిన వారిలో ఒక్క కోహ్లి మినహా అంతా పాజిటివ్ గా తేలారు. దీనిపై కోచ్ రవిశాస్త్రిని వివరణ ఇవ్వాలని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇక టీ20 ప్రపంచ కప్ కోసం బోర్డు టీంను ఎంపిక చేయాల్సి ఉంది. టీంను ఒకట్రెండు రోజుల్లో బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.