వేల కోట్ల ఆదాయం ఓవైపు… కరోనా వైరస్ పరిస్థితులు ఓవైపు… అయినా బీసీసీఐ కరోనాను జయిస్తూ ఐపీఎల్ నిర్వహణకే మొగ్గుచూపింది. యూఏఈలో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ఆటగాళ్లను ఉంచి, ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించారు. స్పాన్సర్స్ వెనుకంజ వేసినా బీసీసీఐ మొండి దైర్యంతో వేసిన అడుగు కోట్లాది రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది.
కేవలం టీవీల ద్వారా ప్రేక్షకులు ఐపీఎల్ చూడగా…4000కోట్లు వచ్చాయి. పైగా గత సీజన్ తో పోల్చితే అన్ని రకాల ఖర్చులు కలిపి 35శాతం తగ్గిపోయాయి. గత ఐపీఎల్ వ్యూయర్ షిప్స్ 25 శాతం పెరిగిందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ముంబై, చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారని పేర్కొంది.
ఐపీఎల్ కోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా 1500మంది నిరంతరం శ్రమించారని, బీసీసీఐ 30వేల కోవిడ్ పరీక్షలు చేసిందన్నారు. ఇక ఐపీఎల్ నిర్వహణకు సహాకరించిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈసీబీకి బీసీసీఐ ముందుగా అంగీకరించినట్లుగా 100కోట్లు చెల్లించిందన్నారు.