అంతా ముందుగా అనుకున్నట్లే ఐపీఎల్ లో ఇక 10జట్లు ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న 8జట్లకు తోడు మరో 2జట్లను రంగంలోకి దింపాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే… 2021లో 8జట్లతోనే ఆడాలని, 2022ఐపీఎల్ నుండి 10జట్లతో బరిలోకి దిగాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధికంగా 9 జట్లు మాత్రమే ఆడాయి. 2011,2012,2013సీజన్లలో 9జట్లు తలపడ్డాయి. నిజానికి 2021 ఐపీఎల్ సీజన్ నుండే 10జట్లతో ఆడాలని అనుకున్నప్పటికీ… జట్ల ఎంపిక, ఆటగాళ్ల వేలం సహా ఇతర అంశాల్లో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో 2022 నుండి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే 2022 నుండి ఐపీఎల్ లో 94మ్యాచ్ లు ఉండబోతున్నాయి.
ఇక 2028 నుండి ఓలంపిక్ లో క్రికెట్ కూడా చేర్చాలన్న దానికి బీసీసీఐ ఆమోదముద్ర వేసింది.
దీంతో… 2022లో ఆడబోయే రెండు కొత్త జట్లు ఏవీ అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలో పుణే,కొచ్చి వంటి టీంలు తెరపైకి రాగా ఇప్పుడు ఆ అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి.