కరోనా పుణ్యమా అని ఎన్నో మారిపోయాయి. క్రికెట్ లోనూ కఠిన నిర్ణయాలు తప్పడం లేదు. బీసీసీఐ కూడా ఐపీఎల్ కోసం ఓ కీ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరైనా సిక్సర్ బాది.. బంతి స్టాండ్స్ లోకి వెళితే అంపైర్లు శానిటైజ్ చేస్తున్నారు. అయితే శానిటైజ్ లేదు.. ఏం లేదు.. బంతే మార్చేద్దాం అని ఆలోచిస్తోందట బీసీసీఐ.
శానిటైజ్ చేసిన బంతి వల్ల కరోనా వ్యాప్తి అవకాశాలు తక్కువే. అయినా రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ అనుకుంటోందని సమాచారం. అందుకే ప్లేయర్ సిక్స్ కొట్టినప్పుడు బంతి స్టాండ్స్ లో పడ్డా.. స్టేడియం అవతల పడ్డా… ఇంకో దాన్ని వాడాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడి.. యూఏఈలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.