ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ కు పండగ రానే వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ మొదలు కాబోతుంది. కరోనా కష్టకాలంలో ఈసారి యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తుండగా… ఏర్పాట్లను బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ స్వయంగా పర్యవేక్షించారు.
ఏడు రోజుల క్రితమే దుబాయ్ వెళ్లిన దాదా… ఆరు రోజుల క్వారెంటైన్ పూర్తి చేసుకున్నాడు. వెంటనే షార్జా క్రికెట్ గ్రౌండ్, ఏర్పాట్లను పరిశీలించనున్నాడు. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరగనున్నాయి. దీంతో స్థానిక అధికారులతో కలిసి స్టేడియాలను గంగూలీ పర్యవేక్షించాడు. మరోవైపు తమకు కేటాయించిన బబుల్ లోనే ఐపీఎల్ టీమ్స్ అన్నీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి.
ఐపీఎల్ 13వ సీజన్ మూడు వేదికల్లో ఒకటైన షార్జాలో మొత్తం 12 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్ 22న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఈ స్టేడియంలో తొలిమ్యాచ్ జరగనుంది.