విరాట్ కోహ్లీకి వన్డే కెప్టెన్సీ వదులుకోవడం ఇష్టం లేదా? బీసీసీఐ కావాలనే రోహిత్ కు పగ్గాలు ఇచ్చిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోడానికి 48 గంటల టార్గెట్ విధించిందట బీసీసీఐ.
నిజానికి 2023 ప్రపంచ కప్ లో టీమిండియాకు నాయకత్వం వహించాలనుకున్నాడు కోహ్లీ. కానీ.. బీసీసీఐ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేసింది. కెప్టెన్ పదవి నుంచి వైదొలిగేందుకు 48 గంటల సమయం ఇచ్చింది. అయితే దీనిపై కోహ్లీ నాన్చుడు ధోరణితో ఉన్నాడని బీసీసీఐ కలగజేసుకొని కెప్టెన్సీని కోహ్లీ నుంచి లాగేసుకుందని ప్రచారం జరుగుతోంది.
నాలుగున్నరేళ్ల పాటు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు కోహ్లీ. అయితే కెప్టెన్ గా చాలా సాధించినా… ఐసీసీ ట్రోఫీని మాత్రం గెలవలేకపోయాడు. ఈ విషయమే అతనికి వ్యతిరేకంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ సారథ్యంలో టీమిండియా.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచకప్, 2021 టీ-20 ప్రపంచకప్ గెలవలేకపోయింది.