టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను బీసీసీఐ సెలక్టర్ ఒకరు హెచ్చరించారు. వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో ప్రతిభను కనబర్చకుంటే.. టీంకు దూరం కాక తప్పదని అన్నారు. అదే జరిగితే పుజారా, రహానే మాదిరిగా జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని ఆయన హితవు పలికారు.
ప్రస్తుతం వెస్టిండీస్ తో టీ20 సిరీస్ భువనేశ్వర్ కు కూడా డెత్ సిరీస్ అని భావించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గత ఏడాది ఐపీఎల్ నుంచి భువనేశ్వర్ బౌలింగ్ లో పదును తగ్గిందని పేర్కొన్నారు.
వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లో తొలి టీ20లో భువనేశ్వర్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఈ ప్రదర్శన అంత గొప్పదేమీ కాదు. అయితే.. రెండు, మూడు టీ20ల్లో భువనేశ్వర్ మెరుగైన ప్రదర్శన చేయకపోతే అతడిపై భవిష్యత్ లో వేటు పడే అవకాశం ఉందని సెలక్టర్లు సూచనప్రాయంగా చెప్పేశారు.
కాగా.. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల్లో రెండు మాత్రమే ఆడిన భువనేశ్వర్.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఫలితంగా విండీస్ తో జరిగే సిరీస్ లో వన్డేలకు ఎంపిక కాలేకపోడని పేర్కొన్నారు సెలక్టర్లు.