హైదరాబాద్ బిర్యానీ అంటే.. ఎవరికీ ఇష్టం ఉండదు. మొదటి సారి నగరానికి వచ్చిన వారు ఎవరైనా సరే ముందుగా తినాలనుకునే ఫుడ్ ఐటమ్ బిర్యానీ. కానీ సిటీలో ఎక్కడపడితే అక్కడ మటన్ బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని తినాలి.
ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో మటన్ పేరుతో బర్రె మాంసాన్ని హోటళ్లకు సప్లై చేస్తున్నాయి. హోటల్ యజామాన్యాలకు అది మేక మాంసం కాదని తెలిసినప్పటికీ తక్కువ ధరకి వస్తుంది కదా అని దానిని కొనుగోలు చేసి బిర్యానీ వేసేస్తున్నారు.
కాలాపత్తార్ పోలీసు స్టేషన్ పరిధిలో పెద్ద స్కామ్ వెలుగు చూసింది. దూడలను చంపి మాంసం విక్రయిస్తున్న ముఠా బాగోతం బయటపడింది. సుమారు 5 దూడలను చంపి మాంసాన్ని విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
అంతేకాకుండా వారి వద్ద నుంచి మరో 19 దూడలను రక్షించారు. దూడ మాంసాన్ని మటన్ పేరుతో పలు హోటళ్ళకు విక్రయిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. యాసిన్, కురుషి, రఫీల్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే విధంగా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మాంసాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.