దేశంలో కరోనాకు సంబంధించి కీలక సూచనలు చేసింది ఐసీఎంఆర్. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు డైరెక్టర్ బలరామ్ భార్గవ. జనం ఒకచోటకు చేరవద్దని… దానివల్ల వైరస్ విజృంభించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా కేరళలో నమోదవుతున్న కేసుల గురించి వివరించారు బలరామ్ భార్గవ. అక్కడ కరోనా ఇన్ ఫెక్షన్లు తగ్గుతున్నట్లు చెప్పారు.
ఇటు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళ నుంచే 68 శాతం ఉంటున్నట్లు చెప్పారు. అక్కడ ఒక్కచోటే 1.99 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వివరించారు. మిగిలిన రాష్ట్రాల్లో వైరస్ తగ్గుముఖం పడుతున్నట్లు చెప్పారు.