ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు పేలడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా హైదరాబాద్ లో ఒక బండి లో బ్యాటరీ పేలడం చూసి అందరూ షాక్ అయ్యారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ భగత్ సింగ్ నగర్ లో పేలిపోయిన ఎలాట్రిక్ స్కూటీ బ్యాటరీ చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. భగత్ సింగ్ నగర్ కు చెందిన సాయికుమార్ రెడ్డి అనే వ్యక్తి మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు.
Also Read: అఖండ సీక్వెల్ పై ఫోకస్ పెట్టిన బోయపాటి
ఈ జాబ్ లో పెట్రోల్ ఆదా చేసుకోవడానికి గానూ చార్జింగ్ స్కూటీ కొనుక్కుని వెళ్తున్నాడు. ప్రతీ రోజు రూ. 150 చొప్పున అద్దె కడుతూ ఈ బండి వాడుకుంటున్నాడు. నిన్న ఉదయం జాబ్ కు వెళ్లి రాత్రి దానికి చార్జింగ్ పెట్టాడు. మంగళవారం రాత్రి 3 గంటల సమయంలో కాలిన వాసన రావడంతో అందరూ బయటకు వచ్చి చూసారు. బ్యాటరీ లో నుంచి కాలిన పొగలు రావడంతో అందరూ లేచి చూసారు.
లేచి చూసి స్విచ్ ఆఫ్ చేసే లోపే బ్యాటరీ పేలిపోవడం తో అందరూ షాక్ అయ్యారు. ఇంటినిండా మంటలు ఎగిసి పడి… పొగలు కమ్ముకోవడంతో వాళ్లకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వాళ్ళు తేరుకునే లోపే ఇంట్లోని బట్టలు, మంచం, సెల్ ఫొన్, తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Advertisements
Also Read: 770 కిలోమీటర్ల మెరుపు, 17 సెకన్ల టైం: మెరుపు వింతలు