కరోనా కొత్త వేరియంట్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. డెల్టా వైరస్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ ఏ క్షణంలోనైనా దేశంలోకి ప్రవేశించవచ్చు… ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల క్వారంటైన్ తర్వాత బయటకు రావాలని కోరారు. కొత్త వేరియంట్ ప్రభావం మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. తగు జాగ్రత్తలు పాటించకుండా అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇప్పటి వరకు అసలు వ్యాక్సినేషన్ తీసుకోని వారున్నా… సెకండ్ డోస్ వేసుకోని వారున్నా.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని డా. శ్రీనివాసరావు కోరారు. ఇటీవల విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళకి పరీక్షలు నిర్వహించాం. ఒకరికి పాజిటివ్ వచ్చింది. నమూనాను జీనోమ్ కి పంపించాం.. రిపోర్టులు వస్తే కానీ అది ఒమిక్రాన్ వైరసా..? కాదా..? అనేది తెలుస్తుందని తెలిపారు. డెల్టా కన్నా ఆరు రెట్లు వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. మూడు రోజుల్లోనే మూడు దేశాల నుండి 24 దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డా. శ్రీనివాసరావు హెచ్చరించారు.