ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం `రొమాంటిక్`. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో మందిరా బేడీని రీప్లేస్ చేస్తూ రమ్యకృష్ణ వచ్చి చేరింది. ఇందుకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. సినిమాకి ఎంతో ఇంపార్టెంట్ షెడ్యూల్ కావడంతో చిత్ర యూనిట్ అంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 30 రోజుల పాటు జరగనున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, పూరి మార్క్ బీచ్ సాంగ్స్‌ను షూట్ చేయనున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరగనున్న ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుదల చేయగా ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా నరేశ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.