కోలివుడ్ స్టార్ హీరో విజయ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. గత ఏడాది మాస్టర్ మూవీతో సూపర్ హిట్ అందుకుతున్నారు. ఇక ఈ ఏడాది దళపతి ‘బీస్ట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించారు. ఇక భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని.. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో కూడా జోరు పెంచారు చిత్రబృందం. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు.
తమిళనాట విజయ్‌కి మాస్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ‘బీస్ట్’ మూవీ కూడా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ సినిమా రూపొందించారు మేకర్స్. ఉగాది పండుగ సందర్భంగా 2.57 నిమిషాల ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ సీన్స్‌తో ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు చిత్ర బృందం. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి.
ఉగ్రవాదం నేపథ్యం చుట్టూ ఈ సినిమా కథ ఉంటుందని ట్రైలర్‌ను చూస్తే.. అర్థం అవుతుంది. ‘రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని’ అన్న డైలాగ్ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. విజయ్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ పట్ల సూపర్ హ్యాపీగా ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో విజయ్ ఇండియన్ స్పై వీర రాఘవన్ అనే ఏజెంట్‌గా కనిపించనున్నారు.
ఇక బీస్ట్ ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో.. బాక్సాఫీస్ దగ్గర కేజీఎఫ్‌తో పోటీ పడాల్సి వస్తుంది. కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న విడుదలకానుంది. దీంతో ఒక రోజు గ్యాపులో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. బీస్ట్ తమిళనాడులో కేజీఎఫ్ చాప్టర్ 2ని డామినేట్ చేస్తుంది. కానీ సినిమా మిగతా అన్ని ప్రాంతాలలో మాత్రం కేజీఎఫ్ డామినేట్ చేయోచ్చని అభిప్రాయపడుతున్నారు.