అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ అంటూ నాచురల్ స్టార్ నాని తో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాతో మరో హిట్ ని లావణ్య త్రిపాఠి తన ఖాతాలో వేసుకుంది. నాగచైతన్య, మంచు విష్ణు, శర్వానంద్, రామ్ లాంటి యంగ్ హీరోల సినిమాల్లో నటించి నటన పరంగా మంచి పేరు తెచ్చుకుంది.
గతేడాది అర్జున్ సురవరం సినిమాలో నిఖిల్ సరసన నటించి మరో విజయాన్ని అందుకుంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఈరోజు ఈ సొట్టబుగ్గల సుందరి 30వ పుట్టిన రోజు. 30వ ఏట అడుగుపెట్టిన ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో అభిమానులు సినీ స్టార్స్ విషెస్ లు తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్ డే లావణ్య అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.