చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి నటన పరంగా తానేంటో నిరూపించుకుంది శ్రీయ. అలాగే ఎన్టీఆర్ ప్రభాస్ వంటి యంగ్ హీరోల సరసన కూడా నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే శ్రీయ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు గడుస్తున్నా అదే జోష్ ను కొనసాగిస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా తన బాడీ షేప్ లో ఎలాంటి మార్పులు రాలేదంటే మామూలు అర్థం చేసుకోవచ్చు తానేంటో.
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు గమనం సినిమా చేస్తోంది. ఈ సినిమాలో వినికిడి లోపం కలిగిన మహిళ గా కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.