టాలీవుడ్ లో సీనియర్ నటుడు బ్రహ్మాజీకి మంచి గుర్తింపు ఉంది. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన ఎన్నో మంచి పాత్రలు చేసారు. స్టార్ హీరోల సినిమాల్లో ఆయన దాదాపుగా కనపడుతూ ఉంటారు. రెమ్యునరేషన్ కూడా ఆయనకు భారీగా ఇస్తూ ఉంటారు. విలన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎన్నో పాత్రలు పోషించారు. ఇప్పటికి కూడా ఆయనకు అలాగే డిమాండ్ ఉంది అనే మాట వాస్తవం.
ఒక సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది ఆ కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇప్పుడు ఆయన కామెడి చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. సినిమా కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న కామెడి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్ అయ్యాయి.
శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న మెన్ టూ అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా పబ్ లో ఒక సీన్ ను షూట్ చేసారట. ఇందుకోసం గాను బీర్లను తాగాల్సి ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ షూటింగ్ లో భాగంగా భారీగా బీర్లు తాగారట. తీరా చూస్తే బీర్ల బిల్లు లక్షన్నరకు పైగా వచ్చిందట. అది చూసి నిర్మాత షాక్ అయ్యారని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.