రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే దాదాపు 40డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవతుండగా, మే నెలలో 50డిగ్రీల ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎండ వేడిమి ఎక్కువవటంతో మద్యంప్రియులంతా ఇప్పుడు బీర్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత మూడు నెలల బీర్ల అమ్మకాల డేటా చూస్తే… బీర్ తాగకుండానే కళ్లు తిరగటం ఖాయం.
జనవరి 2021లో 20,05,554కేసుల బీర్లు అమ్ముడుపోగా, ఫిబ్రవరిలోఓ 22,55,524కేసులు అమ్ముడయ్యాయి. కానీ మార్చి నెలలో భానుడి ప్రతాపానికి మందుబాబులు బీర్ల వెంట పడ్డట్లున్నారు. మార్చి నెలలో ఏకంగా 29,59,118 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. కొద్దిరోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగితే… మందుబాబులు మరింత రెచ్చిపోవటం ఖాయంగా కనపడుతుంది.
కానీ రాష్ట్రంలో అసలే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులున్న నేపథ్యంలో… కాస్తైనా జాగ్రత్త తీసుకుంటారో లేదో.