బీర్ల అయిలయ్య, టీపీసీసీ మెంబర్
మునుగోడు ఉప ఎన్నికల్లో గొల్ల కురుమలు కేసీఆర్ కు బుద్ధి చెపుతారు. తెలంగాణలో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారు. కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే స్కీములు తీసుకొస్తున్నారు. గొల్ల కురుమలు గొప్ప వాళ్ళని చెబుతూనే వారిని తడి గుడ్డతో గొంతులు కోస్తున్నారు. కురుమల స్కీములో అన్నీ మోసాలు జరుగుతున్నాయి. వారికి న్యాయం జరగలేదు.
గొర్రెల కోసం డాక్టర్లకు, కమీషన్లకు, రవాణాకు అయ్యే ఖర్చులే ఎక్కువ. గొల్ల కురుమలకు న్యాయం చేయకుండా మునుగోడు ఎన్నికల కోసమే నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణలో మరోసారి వారిని మోసం చేయనున్నారు.ఉప ఎన్నికలు వచ్చాయన్న కారణంతో గొల్ల కురుమలకు స్కీము తీసుకుని వచ్చి మరోసారి మోసం చేయనున్నారు. అందరూ గమనించాలి.
ఎలక్షన్లు వచ్చినా, ఎక్కడ బైపోల్ వచ్చినా కొత్త స్కీములు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దళిత బంధు పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇవ్వడం బాధాకరం. రాష్ట్రం మొత్తం దళిత బంధు ఇవ్వాలి. ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడం కోసమే నాటకాలు ఆడుతూ గొల్ల కురుమలను కూడా మోసం చేస్తున్నారు.
అన్ని స్కీములు ఇస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయాక ఏ స్కీం కేసీఆర్ ఇవ్వడం లేదు. మునుగోడులో టీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెడతారు. నియోజకవర్గంలో గొల్ల కురుమలే కేసీఆర్ కు బుద్ధి చెప్తారు. తెలంగాణలో మొత్తం గొల్ల కురుమల కోసం నగదు బదిలీ చేయాలి.