బిచ్చగత్తే... ఓ లక్షాధికారి - Tolivelugu

బిచ్చగత్తే… ఓ లక్షాధికారి

Beggar Found Outside Temple with Rs 12k in Cash in Puducherry, బిచ్చగత్తే… ఓ లక్షాధికారి

భిక్షమెత్తుకునే మహిళ దగ్గర పన్నెండు వేల రూపాయల నగదు, రెండు లక్షలు బ్యాంకు అకౌంట్ లో ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తినటానికి తిండి లేని వాళ్లు, అనాధలు బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తుంటారు. కానీ డబ్బులు ఉండి కూడా ఎందుకు ఆ మహిళ బిచ్చమెత్తుకోవాల్సి వస్తుందో అని ఎంక్వయిరీ చేస్తే…అసలు విషయం బయటపడింది.

తమిళనాడులోని కల్లాకురిచి గ్రామానికి చెందిన 70ఏళ్ల పార్వతం గత ఎనిమిది సంవత్సరాలుగా వీధుల్లో తిరుగుతూ, ఆలయం బయట బిక్షం ఎత్తుకుంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటూ జీవనం సాగిస్తుంది. భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకుంటున్న సమయంలో పార్వతం దగ్గర డబ్బులు బయటపడ్డాయి. దీనితో పక్కనే ఉన్న దుకాణదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఆలయ సమీపానికి వచ్చిన పోలీసులు పార్వతం ఆధార్ కార్డుతో పూర్తివివరాలు కనుక్కున్నారు. ఆమె భర్త గత 40 సంవత్త్సరాల క్రితం చనిపోయారని అప్పటినుంచి పార్వతం వీధుల్లో తిరుగుతూ బిచ్చమెత్తుకుని జీవిస్తుందని ఎస్పీ మారన్ చెప్పారు. ప్రస్తుతం ఆమెను కల్లాకురిచి లోని బంధువుల ఇంటికి తరలించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp