ఆర్టీసీ కార్మికుల కోసం తన వంతు సహయం గా 4000 రూపాయలను ఒక బిక్షమెత్తుకునే మహిళ అందించింది. గత మూడు నెలలుగా జీవితాలు ఆర్ధిక ఇబ్బందులతో రోడ్డునపడ్డ కార్మికులకు అండగా తన వంతు సహాయం అందించింది. మిర్యాలగూడ బస్సు స్టేషన్ లో 30 సంవత్సరాలుగా భిక్షమెత్తుకుని జీవిస్తున్న ఈ మహిళ 4000 రూపాయలను ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు విరాళం ఇచ్చింది. ఆ భిక్షగత్తెకు ఉన్న సానుభూతి ప్రభుత్వానికి లేకుండా పోయిందే అంటూ ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.