కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీపై వేటు వేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఆయన అన్నారు. ఈ దేశంలో దొంగను దొంగ అని అనడం కూడా నేరమేనన్నారు.
అది నియంతృత్వ అంతానికి ఆరంభం అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం ఎట్టకేలకు రద్దయిందన్నారు. మన దేశంలో దొంగను దొంగా అని పిలవడం నేరంగా మారిందన్నారు. దేశాన్ని దోచుకుంటున్న దొంగలు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు,
రాహుల్ గాంధీకి ఇప్పుడు శిక్ష పడిందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు రాజ్య సభ ఎంపీ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది కూడా రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండించారు.
ఇది ప్రతీకార చర్య అని ఆమె ట్వీట్ చేశారు. ఆ చర్య అవమానకరమైనదని ట్వీట్లో తెలిపారు. ఈ అనర్హత మనం ఇప్పుడు పంజరంలో ప్రజాస్వామ్య బంధీగా వున్న కాలంలో జీవిస్తున్నామని మరోసారి రుజువు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.