కాంగ్రెస్ పార్టీ చలో ప్రగతి భవన్ కార్యక్రమం నేపథ్యంలో… బేగంపేట్ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు అధికారులు. భద్రతా కారణాల దృష్ట్యా బేగంపేట్ మెట్రో స్టేషన్ ను మూసివేస్తున్నట్లు నోటీసులు అంటించారు పోలీసులు. అసలే బస్సులు లేక ప్రజలు నానా తంటాలు పడుతుంటే మరో పక్క ఈ రోజు బేగంపేటలో మెట్రో ట్రైన్ ఆగదు అని చెప్పటంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. పైగా స్కూల్స్, కాలేజీలు కూడా ప్రారంభం కావటంతో ప్రయాణికుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి.