లేచింది మహిళాలోకం..దద్దరిల్లింది కాలేజీ యాజమాన్యం. ఇది నేటి కాలేజీ యువతుల బృందగానం. ఎందుకంటే నేటి కాలేజీ గరల్స్ ఆంక్షల్ని అంగీకరించరు. ఎంత క్రమశిక్షణ కలిగిన కళాశాల అయినా మేము మాస్వేచ్ఛను వదులుకోము..ఇదీ నేటితరం వాదం.
హైదరాబాద్ బేగంపేట సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీ విద్యార్థినులు దుస్తుల నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థినులు ఏవిధంగా దుస్తులు వేసుకోవాలో తెలియజేస్తూ కొన్ని నిబంధనలు పెట్టింది.
నచ్చిన ఫ్యాషన్, నచ్చిన దుస్తులు వేసుకునే ఈతరం అమ్మాయిలకు కాలేజీ నిబంధనలు నచ్చలేదు. మా దుస్తులు, మా ఇష్టం, నచ్చినవి వేసుకుంటామని వందలాది మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
దుస్తుల పై కాలేజీ ఆంక్షలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నెటిజన్లు విద్యార్థినుల ఆందోళనకు స్పందించారు. ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఈతరం అమ్మాయిలపై ఆంక్షలు విధిస్తే సహిస్తారా?