కాంగ్రెస్ పార్టీని చీల్చే ఉద్దేశం తమకు లేదని ఆపార్టీ జీ-23 నేతలు వెల్లడించారు. కానీ.. పార్టీ పునః వైభవం పొందాలంటే గాంధీ కుటుంబీకులు తమ విధేయులను కీలక పదవుల నుంచి తొలగించాలని సూచించారు.
జీ-23లో సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఇంట్లో సమావేశం అయ్యారు నేతలు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. చీలికలు వస్తే తట్టుకుని నిలబడే పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ లేదని తెలిపారు.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆజాద్ కలవనున్నారు. సమావేశంలో జరిగిన చర్చల గురించి, జీ-23 నేతల ఆందోళనల గురించి తెలియజేయనున్నారు.
Advertisements
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా పాల్గొంటారని సమాచారం. దీంతో వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.