విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ పేరు వింటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అనుమానంగా కనిపించిన వారిపై దాడులు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ వాడనే అనుమానంతో సున్నలో రౌడీ షీటర్ ఏబేలుపై దాడి స్థానికులు దాడి చేశారు.
పాల ఫ్యాక్టరీలో కూలీల నుంచి డబ్బులు లాక్కున్న ఏబేలును చెడ్డీ గ్యాంగ్ చెందినవాడని స్థానికులు వెంబడించారు. అయితే, స్థానికుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన రౌడీ షీటర్.. చెరువులో దూకాడు. దీంతో, ఏబేలును చెరువులో నుంచి లాక్కొచ్చిన స్థానికులు కాళ్లు, చేతులు కట్టి చితకబాదారు.