కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి పెంపుడు జంతువుల్ని సైతం తీసుకుపోవాలను చూసిన ఎంతో మందిని చూసాం. అయితే టికెట్ కొనమన్నందు కన్నబిడ్డను ఎయిర్ పోర్టులో వదిలేసి వెళ్ళజూసింది ఓ భార్యభర్తల జంట.మమకారాన్ని, మానవత్వాన్ని మంటగలిపిన సంఘటన ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సంచలనం రేపింది.
ఓ జంట ఇజ్రాయెల్ నుంచి బెల్జియంలోని బ్రస్సెల్స్ కు వెళ్లవలసి వచ్చింది. అందుకు తమ కొడుకుతో సహా ర్యాన్‌ఎయిర్ విమానం ఎక్కేందుకు ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు.
ఐతే ఈ జంట తమ కొడుకుకి టికెట్ కొనుగోలు చేయలేదు. చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పిల్లాడికి టికెట్ ఇవ్వమని అడిగారు.సదరు జంట పిల్లాడికి టికెట్ కొనలేదని తెలిపారు. కొంత డబ్బు చెల్లించి టికెట్ కొనమని అధికారులు సూచించారు. అందుకు నిరాకరించిన దంపతులు, తమ కొడుకును అక్కడే వదిలి విమానం ఎక్కేందుకు పరుగులు తీశారు.
దీంతో షాక్ తిన్న ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెంటనే అప్రమత్తమయ్యి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దంపతులను బ్రస్సెల్ వెళ్లనివ్వకుండా అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన మేము ఎప్పుడూ చూడలేదు.
అందుకే మేము చూసినదాన్ని వెంటనే నమ్మలేకపోయాము. ఆ చిన్నారిని మా వద్దే ఉంచుకుని పోలీసులకు సమాచారం అందించాం. స్మగ్లింగ్ చేసి చిన్నారిని తీసుకెళ్తున్నారేమోనని అనుకున్నాం. ఐతే చిన్నారి ఆ దంపతుల స్వంత బిడ్డ అని తెలిశాక చాలా ఆశ్చర్యానికి గురయ్యాం.
పోలీసులు వారిద్దరినీ విచారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ర్యాన్‌ఎయిర్ విమానం నిబందనల ప్రకారం తల్లిదండ్రులు పిల్లలతో ప్రయాణాలు చేయవల్సి వస్తే ల్యాప్ సీటు కోసం 25 యూరోలు చెల్లించి టికెట్ కొనుగోలు చేయవల్సి ఉంటుంది